YouTube : తల్లీ,కొడుకులపై అసభ్యకర వీడియోలు…యూట్యూబ్ ఇండియాకు బాలల హక్కుల కమిషన్ నోటీసులు
తల్లులు, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు పెట్టినందుకు యూట్యూబ్ ఇండియా అధికారికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ పెట్టినందుకు తమ ముందు హాజరు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్ ఇండియా అధికారిని కోరింది.....

YouTube India
YouTube : తల్లులు, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు పెట్టినందుకు యూట్యూబ్ ఇండియా అధికారికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ పెట్టినందుకు తమ ముందు హాజరు కావాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్ ఇండియా అధికారిని కోరింది. అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరిస్తూ ఛానళ్లు నడుపుతున్న యూట్యూబ్ పై బాలల హక్కుల ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది.
ALSO READ : Covid-19 : కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
జనవరి 15వతేదీన వ్యక్తిగతంగా తన ముందు హాజరు కావాలని యూట్యూబ్ భారతదేశ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని ఆదేశించింది. భారతదేశంలోని యూట్యూబ్ వ్యవహారాలు,పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు ఎన్‌సిపిసిఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించిన యూట్యూబ్ ఛానెల్ పై ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ వ్యక్తం చేసింది.
ALSO READ : Farooq Abdullah : మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
ఛాలెంజ్ వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు,యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. యూట్యూబ్ వీడియోలు పోక్సో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కనూంగో చెప్పారు. పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే వీడియోలను ప్రదర్శిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఎన్‌సిపిసిఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో హెచ్చరించారు.