Farooq Abdullah : మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడానికి పిలిచింది.....

Farooq Abdullah : మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

Farooq Abdullah

Updated On : January 11, 2024 / 8:08 AM IST

Farooq Abdullah : మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడానికి పిలిచింది. జనవరి 11 వతేదీన విచారణ కోసం తన ముందు హాజరు కావాలని ఫరూఖ్ అబ్దుల్లాను ఈడీ కోరింది.

ALSO READ : Covid-19 : కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

శ్రీనగర్‌లోని తన కార్యాలయంలో అబ్దుల్లాను ఈడీ గురువారం విచారించనుంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడైన అబ్దుల్లాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2022వ సంవత్సరంలో అధికారికంగా అభియోగాలు మోపింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. సంబంధం లేని పార్టీలు, ఆఫీస్ బేరర్‌లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.

ALSO READ : Today Headlines: నేడు ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పర్యటన

అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2018లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత, ఫరూక్ అబ్దుల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు పొందిన ప్రతిపక్ష నాయకుడు. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఫెడరల్ ఏజెన్సీ ప్రశ్నించింది.