హోలీ.. హోలీ.. హోలీ… రంగుల కేళీ.. ఎక్కడ చూసిన హోలీ పండుగ వాతావరణమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు.
హోలీ.. హోలీ.. హోలీ… రంగుల కేళీ.. ఎక్కడ చూసిన హోలీ పండుగ వాతావరణమే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. రంగులు వెదజల్లుతూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హోలీ పండుగ వేడుకల్లో మునిగితేలుతున్నారు. వీధులన్నీ రంగులమయంగా మారిపోయాయి. ఆనందాలు పంచుతూ ఇళ్లు, వీధులన్నీ రంగులమయంగా మార్చుకుని ఆహ్లాదకంగా గడుపుతున్నారు.
ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ఉగ్రవాదం ఒకవైపు.. యువత, చిన్నారులను భ్రష్టు పట్టిస్తున్న పబ్ జీ వీడియో గేమ్ మరోవైపు.. మన దేశాన్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో మన జవాన్లను ఉగ్రవాదులు పొట్టునబెట్టుకున్నారు.
Read Also : వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు : డౌన్ లోడ్ చేసుకోండిలా
అప్పట్లో ముంబైలో జంట పేలుళ్ల ఘటన నాటి చేదు జ్ఞాపకాలను ఇంకా మరవనేలేదు. హోలీ పండుగ సందర్భంగా ముంబై వాసులంతా హోలీ వేడుకల్లో సంతోషంగా జరుపుకుంటున్నారు. ‘హోలీకా దహన్’ లో భాగంగా ముంబైలోని వర్లీ ప్రాంత వాసులు జైషే ఇ- మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ దిష్టిబొమ్మను వీధుల వెంట ఊరేగించి దహనం చేశారు. బాటిల్ వీడియో గేమ్ పబ్ జీ.. ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రయిక్ గా వర్ణిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
చదువుకునే పిల్లల నుంచి యువకులను మానసికంగా కృంగదీస్తున్న ఆన్ లైన్ బాటిల్ వీడియో గేమ్ పబ్జీ భూతాన్ని కూడా దేశం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో హోలీ పండుగ సందర్భంగా వాటి దిష్టిబొమ్మలను దహనం చేసి వేడుకలు జరుపుకుంటున్నారు. మసూర్, పబ్ జీ దిష్టిబొమ్మలను ఊరేగిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mumbai: ‘Holika Dahan’ effigy of Jaish-e-Mohammed’s Masood Azhar and an effigy depicting PUBG, in Worli, ahead of #Holi . pic.twitter.com/UINHOchp9C
— ANI (@ANI) March 20, 2019
Mumbai: Locals burnt an effigy of Jaish-e-Mohammed leader Masood Azhar during ‘Holika Dahan’ in Worli area. pic.twitter.com/7uQcVjoThd
— ANI (@ANI) March 20, 2019