Lockdown In Karnataka : కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు

కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.

Lockdown In Karnataka కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను జూన్-14 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయి.

కాగా,ఈ ఏడాది ఏప్రిల్-27న తొలుత 14 రోజుల క్లోజ్ డౌన్ విధించిన కర్ణాటక..ఆ తర్వాత కరోనా కేసులు పెరగడంతో మే-10నుంచి 24వరకు కంప్లీట్ లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత మళ్లీ లాక్ డౌన్ ను జూన్-7వరకు పొడిగించారు. అయితే లాక్ డౌన్ విధించినప్పటికీ కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఇప్పుడు జూన్-14వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారస్థులు మరియు ఇతర వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు మరో ఆర్థిక ప్యాకేజీని తీసుకురాబోతున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. ఇక ఇప్పటికే.. లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయివారిని ఆదుకునేందుకు రూ. 1250కోట్ల ఉపశమన ప్యాకేజీని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించి విషయం తెలిసిందే.

మరోవైపు,ఈ నెలలో 60లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. దీంతో జూన్-30నాటికి 2కోట్ల మందికి వ్యాక్సిన్ అందించే అందిచడం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు నిరంతర మద్దతు అందిస్తున్న ప్రధాకి థన్యవాదాలు అని యడియూరప్ప ఇవాళ ఓ ట్వీట్ లో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు