లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలో చిన్నారులపై హింస పెరిగిందంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ NV రమణ. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అనే ఎన్జీఓ సహకారంతో తయారుచేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ ఫార్మాట్స్: ఎనర్జింగ్ ఎఫెక్టివ్ లీగల్ సర్వీసెస్’ ను విడుదల చేసిన అనంతరం జస్టిస్ రమణ మాట్లాడుతూ..కరోనా పిల్లలు..మహిళలు..ఇంటిలో ఉండే పెద్దవారికి మహమ్మారిగా మారిందనీ..వారి హక్కులను హరించివేస్తోందని అన్నారు.ముఖ్యంగా చిన్నారులపై హింస పెరిగిందని అన్నారు.
ఈ లాక్‌డౌన్ వేలాదిమంది ప్రాణాలు తీసింది. జీవనోపాథిని దూరం చేసింది. పెద్ద ఎత్తున వలసదారుల కష్టాలకు కారణమైంది. అంతేకాదు.. లాక్‌డౌన్ కారణంలో కుటుంబ హింసను పెంచింది. మహిళలపై పనిభారం మరింతగా పెరిగింది. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. దీనికి తోడు ఓ మాదిరి పెద్ద పిల్లలపై ఇంటిపని భారం కూడా పడిందని అన్నారు.
అంతేకాదు లాక్‌డౌన్ వల్ల ముఖ్యంగా చిన్నారులపై హింస పెరిగిందనీ…అందరూ ఎప్పుడూ ఇంటిలోనే ఉండటం వల్ల పిల్లలపై లైంగిక వేధింపులు..హింసలు కూడా పెరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో హింసకు గురైవుతున్న మహిళలకు చిన్నారుల కోసం ‘వన్ స్టాంప్ సెంటర్లు’ ఏర్పాటు చేశామనీ..ప్రతీ జిల్లాలోని మహిళా ప్యానెల్ న్యాయవాదుల టెలీసర్వీస్ ద్వారా వారికి న్యాయం అందించటానికి నిరంతరం ఏర్పాట్లు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ NV రమణ తెలిపారు.
కాగా..లాక్ డౌన్..అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. మరీ అవసరమైతే తప్ప బైటకు రాకూడదు..ఎక్కడోళ్లక్కడే గప్ చుప్. ఇది కరోనా కాలంలో లాక్‌డౌన్ తెచ్చిన పద్ధతులు. కరోనాను నియంత్రించటానికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి.
కానీ ఉద్యోగాలు..వ్యాపారాలు..ఫ్యాక్టరీలు…ఇలా ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉండిపోవటం అందరికీ ఇబ్బందే. ముఖ్యంగా ఆటలాడుకుంటూ ఉండే చిన్నారులకు మరీ కష్టంగా మారింది. చెంగు చెంగున గెంతుతూ ఆటలాడుకుంటూ..మారాం చేసినా సరే స్కూల్ కు వెళ్లటం..అక్కడి ఫ్రెండ్స్ తో బోలెడన్నీ కబుర్లు ఇలా అన్నీ లాక్ డౌన్ అయిపోయాయి. రోజుకు 24 గంటలూ పిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారు. ఇంట్లోనే ఉండటంతో నీ అల్లరి ఎక్కువైపోయింది..అంటూ పెద్దవాళ్లు కోప్పడటం..కొట్టటం..తిట్టటం వంటివాటితో వారు కొన్ని ఒత్తిడులకు గురవుతున్నారని నిపుణులు కూడా అంటున్నారు.
దానికి తోడు ఇంటిలో ఓ మాదిరి పెద్ద వయస్సు పిల్లలపై పనిఒత్తిడి కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఇంటిలో ఉండేవారంతా నెలల తరబడి ఇంటికే పరిమితం కావటంతో మహిళలు..ముఖ్యంగా చిన్నారులు హింసకు గురవుతున్నాయని పిల్లల నిపుణులు అంటున్నారు.
Read: కర్ణాటక బస్సులో కరోనా కాలపు కండెక్టర్‌ని చూడండీ..దటీజ్ కోవిడ్-19 టైమ్