టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సోమవారం బంపరాఫర్ అనౌన్స్ చేసింది. 15రోజుల పాటు నిర్వహించే కోర్సుకు డిజిటల్ సర్టిఫికేషన్ సైతం ఇవ్వనుంది. కెరీర్ ఎడ్జ్ అనే సర్టిఫికేషన్ కోర్సుకు స్టూడెంట్లు, ఉద్యోగులు అందరూ అర్హులేనని ప్రకటించింది. లాక్ డౌన్ టైంలో వారి స్కిల్స్ ను మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
దీని ద్వారా విద్యార్థులు తమ లోపాలను తెలుసుకోవచ్చు. టీసీఎస్ టెక్కీస్ నిర్వహించిన రికార్డెర్ వెబినార్స్ అసెస్‌మెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లలో నేర్చుకోవచ్చు. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ కాలంలో TCS ION చేస్తున్న రెండో ప్రయత్నమిది. ఇంతకుముందు ‘డిజిటల్ గ్లాస్ రూమ్’ పేరుతో వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
14 days. 14 skills. Knock down the lockdown with TCS iON Career Edge, a free self-paced digital certification program. Sign up now: https://t.co/1iO9TK5w3c#TCSiON #CareerEdge #Digital #career #StayAtHome #SkillsAtHome #learningfromhome pic.twitter.com/YXhf3BIijl
— TCS iON (@TCS_iON) April 1, 2020
దీనిని టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ప్లాట్ ఫాంపై నేర్చుకోవాలి. కాకపోతే దీనిని నేర్చుకునేందుకు ఐడీలు క్రియేట్ చేసుకోవాలి. అందులో క్వాలిఫై అయితేనే ఈ ప్రోగ్రాం నేర్చుకోగలం. లాగిన్ అయ్యేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. లాక్‌డౌన్ ప్రోగ్రాం ఫ్రీ కోర్సు