Kerala: నాలుగు జిల్లాల్లో ట్రిపుల్ లాక్‌డౌన్

కేరళలోని నాలుగు జిల్లాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి ట్రిపుల్ లాక్‌డౌన్ కింద ఉంచారు. ఇక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహామాంరిని అరికట్టడానికి మే 23 వరకు ట్రిపుల్ లాక్డౌన్

Kerala Lockdown:కేరళలోని నాలుగు జిల్లాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి ట్రిపుల్ లాక్‌డౌన్ కింద ఉంచారు. ఇక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహామాంరిని అరికట్టడానికి మే 23 వరకు ట్రిపుల్ లాక్డౌన్ విధించారు, ప్రస్తుత లాక్డౌన్ రాష్ట్రంలోని ఇతర 10 జిల్లాల్లో కొనసాగుతుందని వెల్లడించారు.

రాష్ట్రంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాక తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల సరిహద్దులను సీజ్ చేశారు. డ్రోన్లు, జియో ఫెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

కేరళ ట్రిపుల్ లాక్‌డౌన్: అనుమతించేవి

*మధ్యాహ్నం 2 గంటల వరకూ హోమ్ డెలివరీ అవసరాలతో సహా దుకాణాలను అనుమతిస్తారు
*బ్యాంకులు, భీమా మరియు ఆర్థిక సేవలు సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు కనీస సిబ్బందితో పనిచేస్తాయి.
*సహకార బ్యాంకులు సోమ, గురువారాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.
*ఉదయం 8 గంటలకు ముందే పాలు, వార్తాపత్రికల పంపిణీ పూర్తి చేయాలి.
*సరసమైన ధరల దుకాణాలు, మిల్క్ బూత్‌లు అన్ని రోజులలో సాయంత్రం 5 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఇవ్వగా, రెస్టారెంట్లు,హోటళ్ళు ఉదయం 7 నుండి రాత్రి 7.30 వరకు హోమ్ డెలివరీ సేవలతో మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంది.
*మెడికల్ షాపులు, పెట్రోల్ పంపులు, ఎటిఎంలు, ప్రాణాలను రక్షించే పరికరాలు, ఆస్పత్రులు ఇతర క్లినికల్ సంస్థలు విక్రయించే దుకాణాలు అన్ని రోజులలో పనిచేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు