పంట పొలాల్లో డీజేలు..తీన్మార్ లతో మిడతల్ని తరిమేస్తున్న రైతులు

  • Publish Date - May 28, 2020 / 05:48 AM IST

కరోనా కష్టాలతో పోరాడే భారత్ కు మరో కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. అదే మిడతలదండు. ఈ మిడతల దండు చేసే నష్టాలకు పాపం..రైతులు తల్లడిల్లిపోతున్నారు. వీటి పీడ వదిలించుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు. దేశాలు..రాష్ట్రాలు  సరిహద్దులు దాటి వచ్చి పడిపోతున్న మిడతల దండులు పాలద్రోలటానికి పళ్లాలు..కర్రలు పట్టుకుని డప్పులు కొడుతూ వాటిని తరుముతున్నారు. అంతేకాదు మరింత వినూత్నంగా ఆలోచించిన రైతులు ఏకంగా పొలాల్లో డీజేలను పెడుతున్నారు. ఆ భారీ సౌండులతో మిడతల్ని వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. 

గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాల్లో మిడతల దండు బీభత్సం సృష్టిస్తోంది. పంటల పొలాలపై పడి సర్వ నాశనం చేస్తున్నాయి. లెక్కలేన్ని మిడతలుదండులు దండులుగా వచ్చి..వేలకు వేల ఎకరాల పంటను స్వాహా చేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్‌ మీదుగా భారత్‌ మీద దండెత్తిన ఈ మిడతల దండు.. ఇప్పుడు మహారాష్ట్రలోకీ ప్రవేశించింది. అక్కడ నుంచి తెలంగాణలోకి కూడా వచ్చేశాయి.

యూపీలోని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తమ పంటపొలంలో డీజే మోత మోగించాడు. ఓ వాహనానికి లౌడ్ స్పీకర్‌లను అమర్చి..భారీ సౌండ్ తో బెంబేలెత్తించాడు. లౌడ్ స్పీకర్ల మోతకు మిడతలు పిచ్చిక్కినట్లుగా పారిపోతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను యూపీ సీనియర్ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. డీజే పాటలు తీన్మార్ డాన్స్‌లకే కాదు..మిడతలను తరిమేందుకు కూడా ఉపయోగపడతాయని సరదాగా పోస్ట్ చేశారు రాహుల్ శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ ఐడియా బహుబాగుంది..మేము కూడా ఈరోజే ట్రై చేస్తామంటున్నారు తోటి రైతులు. 

Read:  క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి చేసుకున్న ప్రేమజంట…ఇది కరోనా కాలం ట్రెండ్