×
Ad

Right to Disconnect Bill 2025 : ఆఫీసు అయిపోయాక, సెలవు రోజుల్లో బాస్, కంపెనీ వాళ్లు ఫోన్లు చేసి చావగొడుతున్నారా?.. ఇక నుంచి కుదరదు.. కేంద్రం కొత్త బిల్లు

Right to Disconnect Bill 2025 : ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్‌కనెక్ట్ నబిల్లు -2025ను

Right to Disconnect Bill 2025

Right to Disconnect Bill 2025 : ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు -2025ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు – 2025 ప్రకారం.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు కార్యాలయ పనుల నిమిత్తం ఫోన్ చేసి, మెయిల్స్ పంపి వారి విశ్రాంతికి భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

విధులు ముగిశాక, సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు వారి కార్యాలయాల నుంచి ఫోన్లు, మెయిల్స్ రావడం వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవనానికి ఆటంకం కలుగుతోందని బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా సుప్రియా సూలే పేర్కొన్నారు. అటువంటి కాల్స్, మెయిల్స్‌ను స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలని బిల్లు పేర్కొంది. దీనికి గాను ఉద్యోగుల సంక్షేమ సంఘంను నెలకొల్పాలని బిల్లు ప్రతిపాదించింది.

Also Read: Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. వారికి శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి