NATRAX : అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్

మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పితాంపూర్ లో అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్ అందరినీ ఆకట్టుకొంటోంది. ఈ కొత్త హై స్పీడ్ టెస్టు ట్రాక్ గుడ్డు ఆకారంలో ఉంది. ప్రపంచంలోనే ఇది ఐదవ అతిపెద్ద ట్రాక్ గా చెప్పవచ్చు. ఇండోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

Track

National Automotive Test Tracks : మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పితాంపూర్ లో అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్ అందరినీ ఆకట్టుకొంటోంది. ఈ కొత్త హై స్పీడ్ టెస్టు ట్రాక్ గుడ్డు ఆకారంలో ఉంది. ప్రపంచంలోనే ఇది ఐదవ అతిపెద్ద ట్రాక్ గా చెప్పవచ్చు. ఇండోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సుమారు 3వేల ఎకరాలలో దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. మొత్తం 11.3 కిలోమీటర్లు, 16 మీటర్ల వెడల్పు, 4 ప్రత్యేక దారులున్నాయి. ఈ ట్రాక్ ను మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. ఇది అందుబాటులోకి రావడంతో ఇక నుంచి వాహనాల పరీక్షల కోసం విదేశాలకు పంపించాల్సిన అవసరం ఉండదు.

విదేశాల నుంచి వచ్చే వాహనాలను సైతం ఇక్కడి నుంచే పరీక్షించే వీలుంది. వేగం తనిఖీ చయడం, తటస్థ వేగం గంటకు 250 కి.మీటర్లు, గంటకు గరిష్టంగా 375 కి.మీటర్ల వేగంతో రూపొందించారు. వాహనం పనితీరును పరీక్షించడానికి పరిమితి లేదు, కాబట్టి ఇది ఓపెన్ టెస్టింగ్ లాబొరేటరీగా మారింది. ట్రాక్ లో గరిష్ట వేగంతో నడపడానికి, పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. వాహనం యొక్క పనితీరు, డ్రైవింగ్ సౌలభ్యం, వాహనం బలాన్ని చూడగలుగుతారు. నాట్రెక్స్ హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ అన్ని రకాల వాహనాల కోసం ఇది ఏర్పాటు చేశారు.