×
Ad

Suicide : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

కర్నాటకలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెందిన ప్రేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది.

  • Published On : December 2, 2021 / 09:04 AM IST

Suicide

Love couple suicide in Karnataka : కర్నాటకలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెందిన ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్‌ (21), వరలక్ష్మి (20) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్‌తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని పేర్కొన్నారు.

బీఏ చదివిన సతీశ్‌ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వరలక్ష్మి నర్సింగ్‌ చదువుతోంది. కాగా, సతీశ్‌ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాతే పెళ్లి అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పాడు. దీంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. ప్రేమజంట సతీశ్‌, వరలక్ష్మి మంగళవారం మైసూరుకు వెళ్లి లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నారు.

Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో లాడ్జ్ సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ప్రేమ జంట ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నారు. లాడ్జ్‌ యజమాని లష్కర్‌ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.