×
Ad

LPG Price Hike : పండుగల వేళ బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

LPG Price Hike : ఈ నెలలో దసరా, దీపాళి వంటి ప్రముఖ పండుగుల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చాయి.

LPG Gas Price

LPG Price Hike : అక్టోబర్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో దసరా, దీపాళి వంటి ప్రముఖ పండుగుల వేళ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు షాకిచ్చాయి. అక్టోబర్ 1న చమురు మార్కెట్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి. 19కిలోల సిలిండర్ ధర పెరగ్గా.. గృహ అవసరాలకు వినియోగించే 14కిలోల సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. (LPG Price Hike)

19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.15 పెరిగింది.. కొన్ని ప్రాంతాల్లో రూ. 16 పెరిగింది. 14కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. IOCL వెబ్ సైట్ లో నవీకరించిన ఎల్పీజీ సిలిండర్ ధరల ప్రకారం..


♦ ఢిల్లీలో 19 కిలోల సిలిండర్‌ రూ. 1,595.50 (రూ. 15.50 పెరిగింది)
♦ కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్‌ రూ. 1,700.50 (రూ. 16.5 పెరిగింది)
♦ ముంబైలో 19 కిలోల సిలిండర్‌ రూ. 1,547 (రూ. 15.50 పెరిగింది)
♦ చెన్నైలో 19 కిలోల సిలిండర్‌ రూ. 1,754.50 (రూ. 16.5 పెరిగింది)
♦ హైదరాబాద్ లో 19 కిలోల సిలిండర్ రూ. 1,817.50 (రూ.16 పెరిగింది.)
♦ విశాఖపట్టణంలో 19 కిలోల సిలిండర్ రూ.1,649 (రూ.15.50 పెరిగింది)

గత నెలలో చమురు మార్కెటింగ్ కంపెనీలు 19కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.51.50 తగ్గించాయి. ఆగస్టు నెలలో రూ.33.50 తగ్గగా.. జులై నెలలో రూ.58 తగ్గింది. అయితే, తాజాగా అక్టోబర్ నెల ధరల్లో 19కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది.

Also Read: Heavy Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వారంరోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..