మళ్లీ బలోపేతం అయ్యేందుకు మావోయిస్టులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
హైదరాబాద్ : మావోయిస్టులు దూకుడు పెంచారు. మళ్లీ బలోపేతం అయ్యేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీని కోసం అంతర్గత లోపాలపై దృష్టి సారించారు. తొలిసారి ఆదివాసికి నాయకత్వ బాధ్యతలు అప్పగించించారు. దండకారణ్యంపై పట్టున్న వ్యక్తిని మావోయిస్టు మిలటరీ కమిషన్ కు ఇంచార్జ్ గా నియమించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ లోని సుకుమా జిల్లా పూవర్తికి చెందిన మడవి సిగ్మాకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కమిషన్ ఇంచార్జ్ గా మడవి సిగ్మా ఎంపికయ్యారు. త్వరలో ఆయన బాద్యతలు చేపట్టనున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం డోర్నకల్ ప్రాంతంలోని చింతల్ నార్ వద్ద జరిగిన దాడి ఘటనతోపాటు అనేక ఘటనలకు సిగ్మా సూత్రధారిగా వ్యవహరించారు. కీలక సమయంలో ఆయన నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సిగ్మాపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 లక్షల రివార్డును ప్రకటించాయి. మరోవైపు తాజా పరిణామాలతో అలర్ట్ అయిన నిఘా వర్గాలు సిగ్మా కదలికపై నజర్ పెట్టాయి.