Datia Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి నదిలో పడిన పెళ్లిబృందం ట్రక్కు ..

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో పడిపోవటంతో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. కొందరు చిన్నారులు నదిలో తప్పిపోయారు.

Datia Road Accident

Datia Road Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రం దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న మినీ ట్రక్కు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి. ప్రమాదం తరువాత ట్రక్కులో ప్రయాణిస్తున్న పిల్లలు కొందరు తప్పిపోయినట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు గ్వాలియర్‌లోని బిల్హేటి గ్రామ నివాసితులు. వారు తమ వధువు తరపున వివాహంకోసం తికమ్‌ఘర్‌ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బుహ్రా నదిలో పడిపోయింది.

Pedestrian Accident: ఇది చాలా ప్రమాదకరం.. తొందరపడొద్దు.. వీడియో షేర్ చేసిన సజ్జనార్

మరోవైపు బుహ్రా నదిలో ట్రక్కు పడిపోయిన సమాచారం అందిన వెంటనే గ్రామస్తులు ట్రక్కులోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడినవారిలో కొందరు చిన్నారులు కనిపించకుండా పోయారు. వారికోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 30 మందికి గాయాలైనట్లు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Odisha Bus Accident : ఒడిశాలో రెండు బస్సులు ఢీ, 10 మంది మృతి, 8మందికి గాయాలు

రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సంఘటన స్థలంలో పోలీస్ సూపరింటెండెంట్ ప్రదీప్ శర్మ ఉన్నారు. మినీ ట్రక్ ప్రమాదానికి గురైన సమయంలో 50 మంది ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.