CM Mohan Yadav : మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న 11 రాష్ట్రాల సీఎంలు

అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సుపరిపాలన అందేలా కృషి చేస్తానని మధ్యప్రదేశ్ కొత్త సీఎం తెలిపారు. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి 11 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారని తెలిపారు.

Madhya Pradesh CM Mohan Yadav

Madhya Pradesh CM Mohan Yadav : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ సీఎం అభ్యర్ధులను కూడా ప్రకటించింది. దీంట్లో భాగంగా ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (డిసెంబర్ 13,2023) ప్రమాణస్వీకారం చేయనున్నారు.

భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండులో మోహన్ యాదవ్, రాయపూర్ నగరంలోని సైన్స్ కళాశాల మైదానంలో విష్ణు సాయి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే పలువులు బీజేపీ నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లుగా సమాచారం.

తన ప్రమాణస్వీకారోత్సం సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతు..అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సుపరిపాలన అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి 11 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారని తెలిపారు.

కాగా..మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జగదీష్ దేవరా కూడా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు