Electricity Bill: మధ్యప్రదేశ్ వ్యక్తికి రూ.3వేల 419 కోట్ల కరెంట్ బిల్

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక గుప్తా పవర్ బిల్ చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూ.3వేల 419కోట్ల బిల్ రావడంతో ఇంటిల్లిపాది నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్ నడిపిస్తున్న పవర్ కంపెనీ ఇదంతా మానవ తప్పిదమని రూ.1300 రావడానికి బదులు అలా వచ్చిందని చెప్పింది.

 

Electricity Bill: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక గుప్తా పవర్ బిల్ చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూ.3వేల 419కోట్ల బిల్ రావడంతో ఇంటిల్లిపాది నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్ నడిపిస్తున్న పవర్ కంపెనీ ఇదంతా మానవ తప్పిదమని రూ.1300 రావడానికి బదులు అలా వచ్చిందని చెప్పింది.

అలా శివ్ విహార్ కాలనీకి చెందిన గుప్తా ఫ్యామిలీకి జరిగింది. జులై నెలకు వచ్చిన బిల్ చూసి తన తండ్రికి స్ట్రోక్ వచ్చినట్లు అయిందని సంజీవ్ కంకణె వెల్లడించారు.

జులై 20న వచ్చిన బిల్.. మధ్యప్రదేశ్‌లోని మధ్య క్షేత్ర విద్యుత్ విత్రన్ కంపెనీ తన పొరబాటును గమనించింది. ఆ తర్వాత స్టేట్ పవర్ కంపెనీ లోపాన్ని సవరించినట్లు చెప్పింది. ఉద్యోగులు దీనిపై శ్రద్ధ వహించాలని ఎంపీఎమ్కేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మంగ్లిక్ ఈ మానవ తప్పిదాన్ని ఖండించారు.

Read Also : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

“వినియోగించిన యూనిట్లకు బదులుగా ఎంప్లాయ్ వినియోగదారు నంబర్‌ను ఎంటర్ చేశారు. ఫలితంగా ఎక్కువ మొత్తంతో అంటే కోట్లలో బిల్లు వచ్చింది. సరిచేసి రూ 1,300 బిల్లు విద్యుత్ వినియోగదారుకు జారీ చేశాం” అని ఆయన చెప్పారు.

లోపాన్ని సరిదిద్దామని, సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ మీడియాతో చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు