Dinosaur : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

మధ్యప్రదేశ్ లోని బడవానీ అడవిలో పది డైనోసార్ రాతి గుడ్లను కొనుగొన్నారు. సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం ఈ ఆసక్తికరమైన వార్తకు కేంద్రంగా మారింది.

Dinosaur : మధ్యప్రదేశ్ లో కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ రాతి గుడ్లు

Dinosaur

dinosaur’s stone eggs : డైనోసార్లు.. భూమిపై అతి పెద్ద ప్రాణులుగా గుర్తింపు పొందాయి. అయితే చాలా కాలం క్రితమే డైనోసార్లు అంతరించిపోయాయి. కానీ వాటి గుడ్లు శిలాజీకరణ రూపంలో ఇప్పటికీ బయటపడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని బడవానీ అడవిలో పది డైనోసార్ రాతి గుడ్లను కొనుగొన్నారు. ఈ ఆసక్తికరమైన వార్తకు సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం కేంద్రంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. పురాతన శిల్పాలు, కోటలపై గత జనవరి 30న పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ డిపి. పాండే సర్వే ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న అటవీ అధికారులతోపాటు వర్ల తహసీల్ లోని హింగ్వా గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు.

Tunnel Collapsed : మధ్యప్రదేశ్ లో కూలిన సొరంగం.. చిక్కుకుపోయిన కార్మికులు

ఈ సందర్భంగా రాతి గుడ్లు పాండేకు కనిపించాయి. వాటిలో ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగిలినవి 25 కేజీల మేర ఉన్నాయి. ఇవి కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ గుడ్లుగా గుర్తించారు. వీటిని ఇండోర్ మ్యూజియంలో ఉంచనున్నారు.