వరదనీటిలో మహిళ అంతిమయాత్ర

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 05:36 AM IST
వరదనీటిలో మహిళ అంతిమయాత్ర

Updated On : October 4, 2019 / 5:36 AM IST

భారీ వర్షాల ప్రభావంతో దేశమంతా కూడా ప్రతీ చోట అనేక ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలోనే జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తగా.. భోపాల్‌, మాండ్‌ సౌర్‌ జిల్లాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. 

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా  మంద్ సార్ జిల్లా నౌగాన్ గ్రామంలో వరదలు ముంచెత్తాయి. గురువారం (అక్టోబర్ 3, 2019)న ఓ మహిళ మృతి దేహాన్ని అంతిమయాత్ర చేసేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న నాలాపై నుంచి వరద నీరు పోతున్నా.. వేరే దారి లేకపోవడంతో గ్రామస్థులు నాలాపై నుంచి వెళ్లారు. 

ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, అయినా అధికారులు ఏమాత్రం వాల్ల బాధను పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.