Madras High Court Widow temple Entry
Madras High Court : ఇది కంప్యూటర్ యుగం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. అంతరిక్షంలో మనిషి ఎన్నో ఘన విజయాలు సాధించాడని ఇంకా ఎన్నో విజయాలు చేయటానికి అడుగులు వేస్తున్నామని.. చంద్రుడిపై కాలుమోపామని ఇలా ఎన్నో గప్పాలు కొట్టుకునే మనిషి ఇంకా ఆటవిక పోకడలను వదిలించుకోవటంలేదనే ఘటనలు వెలుగులోకి వస్తు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి. సంప్రదాయం పేరుతో దళితులను దేవాలయాల్లోకి అడుగు పెట్టనివ్వకపోవటం.. భర్త చనిపోయిన స్త్రీల (Widow)ను వివక్షగా చూడటం వంటివి ఈ కంప్యూటర్ యుగంలో కూడా కనిపిస్తు ఆధునికతను సవాల్ చేస్తున్నాయి.
భర్త చనిపోయిన స్త్రీని దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఘటన తమిళనాడు (Tamil Nadu)లో జరిగింది. దీంతో సదరు మహిళ మనస్తాపానికి గురై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వితంతువు ఆలయంలోకి ప్రవేశించకుండా ఆపలేమని పేర్కొంది. తమిళనాడు ఈరోడ్ (Erode) జిల్లాలోని ఓ వితంతు మహిళ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో స్త్రీకి ఓ గుర్తింపు ఉందని.. ఆ గుర్తింపు భర్త చనిపోతే పోదని వ్యాఖ్యానించింది. వితంతు మహిళ ఆలయంలోకి ప్రవేశించకుండా ఆపడం వంటి పురాతన విశ్వాసాలు రాష్ట్రంలో ప్రబలంగా ఉండటం చాలా దురదృష్టకరమని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ (Justice N Anand Venkatesh) ధర్మాసనం పేర్కొంది.
Article 370 : రద్దు చేసి నేటితో నాలుగేళ్లు పూర్తైంది.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ఎలా ఉంది?
జిల్లాకు చెందిన తంగమణి (Thangamani) అనే వితంతు మహిళను పెరియాకారుపరాయణ్ ఆలయం (Periyakaruparayan temple)లో దర్శించుకోవటానికి రాగా అక్కడున్న కొంతమంది అడ్డుకున్నారు. గతంలో ఆ ఆలయంలో పూజారిగా పనిచేసిన ఆమె భర్త 2017 ఆగస్టు 28న మరణించాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాల్లో కుమారుడితో కలిసి పాల్గొనాలని తంగమణి దేవాలయానికి వచ్చింది. దీంతో భర్త చనిపోయిన స్త్రీ గుడిలోకి వెళ్లకూడదంటూ అడ్డుకున్నారు. మనస్తాపానికి గురి అయి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది.
ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వితంతువు ఆలయంలోకి ప్రవేశిస్తే అపవిత్రమవుతుందన్న ప్రాచీన విశ్వాసం రాష్ట్రంలో నెలకొనడం చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. భర్తను కోల్పోయిన కారణంగా స్త్రీని అవమానించడం చాలా తప్పు. చట్టబద్దమైన పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవని స్పష్టంచేసింది. ఎవరైనా వితంతువులను ఆలయంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ.. విచారణకు ఆదేశం
ఒక మహిళ సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు కలిగి ఉంటుందని.. ఆమె వైవాహిక స్థితిని బట్టి అది ఏ విధంగానూ పోదు అంటూ పేర్కొంది. దేవాలయంలో జరిగే వేడులకు ఆమెనుగానీ, ఆమె కుమారుడికి గాని అడ్డుకునే హక్కు ఎవరి లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో తంగమణి, ఆమె కుమారుడు పాల్గొనేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.