‘స్టాండింగ్ వీల్ చైర్’: హెల్ప్ అక్కర్లా..లేవొచ్చు..కూర్చోవచ్చు

  • Publish Date - November 6, 2019 / 07:23 AM IST

దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా  కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారు ఈ వీల్ చైర్ లో కూర్చోవాలన్నా..పైకి లేవాలన్నా వారంతట వారుగా ఎవరి సహాయం లేకుండా లేవవచ్చు..కూర్చోవచ్చు. అటువంటి అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసి మంగళవారం (నవంబర్ 5)ప్రారంభించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. దీని పేరు ‘స్టాండింగ్ వీల్ చైర్’ 
ఫీనిక్స్ మెడికల్ సిస్టమ్స్ సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ   ‘స్టాండింగ్ వీల్ చైర్’ను తయారు చేసింది. ‘అరిస్’ అని బ్రాండ్ నేమ్ తో ఈ వీల్ చైర్ ను తయారు చేసింది. ఈ చైర్ ను మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సుజాత శ్రీనివాసన్ నేతృత్వంలోని ఐఐటిఎమ్‌లోని టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్‌మెంట్ వీల్ చైర్‌ను డిజైన్ చేసి డెవలప్ చేసింది. 
ఈ ‘స్టాండింగ్ వీల్ చైర్’ ను కేంద్ర మంత్రి తవార్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ సందర్బంగా గెహ్లాట్ మాట్లాడుతూ..తాను చాలా దేశాల్లో పర్యటించాననీ..కానీ.. ఎక్కడా ఇంత మంచి స్టాండింగ్ వీల్ కుర్చీని చూడలేదని అన్నారు. దివ్యాంగులకు ఈ చైర్ చాలా బాగా ఉపయోగపడుతుందని అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

నిరుపేదల కోసం ప్రభుత్వం..చట్టసభ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి ద్వారా ఈ స్టాండింగ్ వీల్‌చైర్లు అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ట్రెడిషన్ వీల్‌చైర్‌లకు బదులుగా ఈ స్టాండింగ్ వీల్‌చైర్‌లను ఉపయోగించడం ద్వారా వీల్ చైర్లకు పరిమితమైపోయినవారు సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించవచ్చని అన్నారు. కూర్చునే ప్లేస్ నుంచే నిలబడటం..నిలబడిన ప్లేస్ నుంచే దివ్యాంగులు స్వతంత్రంగా..ఎవరి సహాయం లేకుండా ఆరిస్ స్టాండింగ్ వీల్ చైర్ రూపొందించబడిందని అన్నారు.