Earthquake : అండమాన్ సముద్రంలో భూకంపం

అండమాన్ సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....

Earthquake

Earthquake : అండమాన్ సముద్రంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అండమాన్ సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.

Read Also : Bollywood Actor : ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా…నేలమాళిగలో సురక్షితం

అఫ్ఘానిస్థాన్ దేశంలో సంభవించిన భారీ భూకంపంతో 120 మంది మరణించగా, మరో వెయ్యిమంది గాయపడ్డారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర్రంలోని ఉత్తరకాశీలోనూ భూకంపం సంభవించింది. ఒకేరోజు దేశంలో మూడు చోట్ల భూకంపం వచ్చింది. మిజోరం, నేపాల్, జమ్మూకశ్మీరులో భూమి కంపించింది. మరో వైపు ఫిలిప్పీన్స్ దేశంలోనూ భారీ భూకంపం వచ్చింది.