Cake Cutting
surprise for 70 years old covid-19 patient : ఓ కరోనా కేంద్రంలో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తితో వైద్య సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఆకేకు అందరూ పంచుకుని తిన్నారు. ఏంటీ కరోనా రోగితో కేక్ కట్ చేయించి ఆ కేకు అందరూ తిన్నారా? అదీ కోవిడ్ సెంటర్ లో..వాళ్లందరికి పిచ్చా ఏంటీ? అని కంగారు పడిపోతున్నారా? అబ్బే భయపడాల్సిన పనిలేదులెండి. అసలు విషయం ఏమిటంటే..
మహారాష్ట్రలోని ఒక కోవిడ్ కేంద్రంలో కరోనాకు చికిత్స పొందుతున్న 70 ఏళ్ల వృద్ధునికి చికిత్స పొందుతున్న సమయంలో ఓరోజున పుట్టిన రోజు వచ్చింది. దీంతో ఈ కోవిడ్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందరూ ఆ వృద్ధుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న అతనికి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఓ కేకు తెప్పించి అతనితో కట్ చేయించారు. పుట్టిన రోజు పాట పాడి అతడిని ఖుషీ చేశారు.
కరోనా బాధితుడు పేరు మహేశ్వర్ పాట్కర్. 70 ఏళ్లు నిండాయి. ఉస్గావ్‌ల మే 1న ప్రారంభించిన కరోనా సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతనికి 70 ఏళ్ల నిండి 71 రాబోతోంది. ఈ విషయం కోవిడ్ సెంటర్ సిబ్బందికి తెలియగానే… వాళ్లు వెంటనే ఓ కేక్ తెప్పించి..పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా..రోగులకు అన్ని వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని..ధైర్యాన్ని నింపి వారు త్వరగా కోలుకునే చేస్తున్నామని కేంద్రం నిర్వాహకుల తెలిపారు.
కాగా..మహారాష్ట్రలోని థానె జిల్లాలో కొత్తగా 1,314 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. జిల్లాలో కరోనా కారణంగా 49 మంది మృతి చెందారు. థానేలోని కోవిడ్ -19 మరణాల రేటు 1.69 శాతంగా ఉంది. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 8,476 మంది ప్రాణాలు కోల్పోయారు.