Bombay HC: ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు..రూ.2 లక్షలు జరిమానా

మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమాని విధించింది.

MP Navneet Kaur Rana Not SC : మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమాని విధించింది. దీంతో పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఎస్సీ కాదంటూ మంగళవారం (జూన్ 8,2021)బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ..నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం జస్టిస్ ఆర్డీ ధనుకా, విజి బిష్ట్ ల డివిజన్ బెంచ్ రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాను ఎంపీ మహారాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.

నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈక్రమంలో నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సంచలన తీర్పుని వెలువరించింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తేల్చింది. కుల ధ్రువీకరణ రద్దు అయిన క్రమంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడినట్లుగా తెలుస్తోంది.

కాగా. గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం తెలిసిందే. పార్లమెంటులో మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తామని ఎంపీ అరవింత్ సావంత్ తనను బెదిరించారని..శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లెటర్స్ కూడా వస్తున్నాయని… ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారని గతంతో నవనీత్ కౌర్ ఆరోపించారు. దీనిపై నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు