కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి జనతా కర్ఫ్యూ విధించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. 2020, సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం, తిరిగి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సామాన్యులు చేసిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మేయర్ సందీప్ జోషి వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరూ ఇళ్లల్లోంచి ఎవరు కూడా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
నాగ్‌పూర్‌తో పాటు సాంగ్లి, కొల్హాపూర్, జల్గావ్, రాయ్‌గడ్, ఔరంగాబాద్ లాంటి ఇతర పట్టణాల్లో ‘జనతా కర్ఫ్యూలు’ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పదే పదే ఎన్నిసార్లు సూచించినా..కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, లాక్ డౌన్ ప్రభుత్వం విధించే అవకాశం లేనందున ప్రజల భాగస్వామ్యంతో..జనతా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య 11,21,221 పెరిగాయి. ఒకే రోజులో 23 వేల 365 కేసులు రికార్డు అవడం గమనార్హం. రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 30 వేల 883 కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది. బుధవారం 17 వేల 559 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 7 లక్షల 92 వేల 832కు చేరుకున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 97 వేల 125గా ఉన్నాయి.