Eknath Shinde: ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజన్ సర్కార్: మహారాష్ట్ర సీఎం షిండే

మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు..

Eknath Shinde

Eknath Shinde – BJP: మహారాష్ట్రలో తమది ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉండడాన్ని ఆ పార్టీ నేతలు డబుల్ ఇంజన్ సర్కారుగా పేర్కొంటున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్సీపీలోని శరద్ పవార్ ను, ఆయన వర్గ ఎమ్మెల్యేలను కూడా ప్రభుత్వంతో కలిపేసుకుంది.

దీనిపై ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ… అజిత్ పవార్ చేరికలో మహారాష్ట్ర మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు. ఇంత వరకు ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన చేరికతో ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిందని చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు.

మహారాష్ట్ర అభివృద్ధి కోసమే తాము అజిత్ పవార్, ఆయన వర్గ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోకి ఆహ్వానించామని చెప్పారు. ఇవాళ రాజ్ భవన్ లో పవార్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, మంత్రులుగా ఛగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే, ధనుంజయ ముండే ప్రమాణం చేశారు.

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.. అజిత్ పవార్ తిరుగుబాటు