Viral Video: నీటి సంక్షోభం… బిందెలతో బావి చుట్టూ మహిళలు

వారంతా నీటి కోసం అక్కడపడుతున్న కష్టాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో నీటి సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేసింది మొదలు నీటి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వవస్తోంది. తాజాగా, నాసిక్ లోని పెయింత్ గ్రామ మహిళలు ఓ బావి వద్దకు వెళ్లి దాని చుట్టూ నిలబడి నీటిని తోడారు.

వారంతా నీటి కోసం అక్కడపడుతున్న కష్టాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రతిరోజు వారు కీలోమీటర్ల కొద్దీ నడిచి, నీటిని తెచ్చుకోవడానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. కొందరు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బావుల్లోకి దిగుతున్నారు.

నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా మంది కుటుంబాలకు బావి మాత్రమే దిక్కు. అసలే వేసవి కాలం. ఎండలకు ప్రజలు నానా కష్టాలు పడుతూ నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. నాసిక్ లోని అనేక గ్రామాల్లో చాలా ఏళ్లుగా నీటి కొరత ఉంది. చాలా కాలంగా తాము నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, త్వరగా తమ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Rattan Lal Kataria: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూత