Maharashtra Cm Says Will Reduce Vat On Fuel
Maharashtra cm says will reduce vat on fuel : సీఎంగా అధికారం చేపట్టాక ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు షిండే. ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని..దీంట్లో భాగంగానే ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గిస్తామని సోమవారం (7,2022) ప్రకటించారు. క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని త్వరలోనే దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.
వాస్తవానికి ఇంధనంపై అటు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా, రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి. ఇటీవల పలు కారణాలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ఈ క్రమంలో తాము కొంత మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని చెప్పిన కేంద్రం… రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ దిశగా షిండే కీలక ప్రకటన చేయడం గమనార్హం. కాగా..ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెంచుకోవటానికి షిండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన మార్కును చూపించుకోవాలనే యత్నంలో భాగంగా వ్యాట్ ను తగ్గిస్తామని ప్రకటించిందని అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి.
కాగా..ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 ఉండగా..డీజిల్ ధర లీటరుకు రూ.97.28గా ఉంది. మహారాష్ట్ర గత ప్రభుత్వం కూడా మే నెలాఖరులో పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర విధించిన పన్నును లీటరుకు రూ.2.08, లీటరుకు రూ.1.44 తగ్గించింది.