అక్టోబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ : ఒకే దశలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం

  • Publish Date - September 21, 2019 / 06:39 AM IST

ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం

ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున, ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహిస్తారు. 24న ఫలితాలు వెల్లడిస్తారు. సీఈసీ సునీల్ అరోరా ఎన్నికల వివరాలు తెలిపారు. శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

మహారాష్ట్రలో 288, హర్యానాలో 99 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రంలో 8.9 కోట్ల మంది, హర్యానాలో కోటి 28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. నవంబర్ 9తో మహారాష్ట్ర, నవంబర్ 2తో హర్యానా అసెంబ్లీ కాలం ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రలో 1.8 లక్షల ఈవీఎంలు, హర్యానాలో లక్షా 30వేల ఈవీఎంలు వినియోగించనున్నారు.

ఇలా ఎన్నికల నగారా మోగిందో లేదో అప్పుడే పార్టీలు రెడీ అయిపోయాయి. గెలుపు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాల విషయంపై పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. బీజేపీ-శివసేన పొత్తులపై క్లారిటీ లేదు. రెండు రాష్ట్రాల్లో మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పుంజుకోవద్దని భావిస్తున్న బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. లోక్ సభలో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది.

హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుని ప్రజాసేవకు అవకాశం కల్పించాలని కోరుతూ 90 నియోజకవర్గాల్లో సీఎం కట్టర్ ఆగస్ట్-18న జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి బీజేపీని ప్రజలు ఆశీర్వదించబోతున్నారని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

* నామినేషన్ పత్రంలో ఒక్క కాలం వదిలినా నామినేషన్ రద్దు
* క్రిమినల్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు సమర్పించాలి
* ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ సామగ్రి వాడకంపై నిషేధం
* అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిశీలనకు అబ్జర్వర్ నియామకం
* మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
* సెప్టెంబర్ 27న నోటిఫికేషన్
* అక్టోబర్ 4 వరకు నామినేషన్ల స్వీకరణ

* అక్టోబర్ 5న నామినేషన్ల పరిశీలన
* నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 7
* అక్టోబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్
* దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
* అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, 24న కౌంటింగ్
* కర్నాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
* అరుణాచల్ ప్రదేశ్ లో 4, అసోంలో 4, బీహార్ లో 5, ఛత్తీస్ గఢ్ లో ఒక స్థానానికి ఉప ఎన్నికలు
* గుజరాత్ లో 4, హిమాచల్ ప్రదేశ్ లో 2 స్థానాలకు బైపోల్స్
* మేఘాలయలో 1, రాజస్తాన్ లో 2, సిక్కింలో 3, తమిళనాడులో 2 స్థానాలకు ఉపఎన్నికలు
* అక్టోబర్ 21న ఉప ఎన్నికలకు పోలింగ్