Sharad Pawar : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు..కొత్త ప్రభుత్వం రాకతో షాకులు షురూ..

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనించాల్సిన విషయం.

Sharad Pawar : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ (IT)నోటీసులు జారీ చేసింది.మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనించాల్సిన విషయం. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో శరద్ పవార్ సమర్పించిన అఫడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ శాఖ నుంచి తనకు నోటీసులు వచ్చాయని శరద్ పవార్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.

గురువారం (జులై30,2022) రాత్రి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది గంటల్లోనే శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ విమర్శించారు.

కాగా ఓ వైపు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలటం..వెను వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటం.. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎం కావటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడి పుట్టిస్తున్నారు. దీంట్లో భాగంగానే శరత్ పవార్ కు ఐటీ నోటీజులు రావటం. ఊహించని రీతిలో సీఎం ఉద్దవ్ హాయంలో తీసుకున్న నిర్ణయాలపై కొత్త సీఎం షిండే నజర్ పెట్టినట్లుగా ఆరోపణలున్నాయి.

షిండే సీఎం అయిన 24గంటలు పూర్తికాకముందే ట్రబుల్ షూటర్ గా పేరొందని పవార్ కే నోటీసులతో షాక్ ఇచ్చింది ఐటీ శాఖ. ఐటీ శాఖ తనకు నోటీసులు పంపింటంపై శరత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ నుంచి తనకు నోటీసులు రావటం ఆందోళనగా లేదని తాను ఊహించినట్లుగానే తెలిపారు పవారు.

ట్రెండింగ్ వార్తలు