మహారాష్ట్రకు మీరు కావాలి : మెడికల్ ఫీల్డ్ అనుభవమున్న రిటైర్డ్ ఆర్మి సిబ్బందికి ఉద్దవ్ విజ్ణప్తి

మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణాలతో వేరే పనుల్లో చేరిన అందరూ ముందుకు రావాలని,మహారాష్ట్రకు మిమ్మల్ని కావాలనుకుంటోందని సీఎం ఉద్దవ్ ఠాక్రే విజ్ణప్తి చేశారు.

వీళ్లందరూ CovidYoddha@gmail.com ద్వారా తమను చేరుకోవచ్చిని ఉద్దవ్ తెలిపారు. ఈ ఈమెయిల్ ఐడీ ఎటువంటి కంప్లెయింట్లు పంపించడానికి ఉపయోగించబడకూడదని ఆయన తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లోనే ఉంటున్న చాలామంది ప్రజలు వివిధరకాల ఇష్యూస్ ని ఎదుర్కొంటున్నారని తాను అర్థం చేసుకున్నానని ఉద్దవ్ తెలిపారు. ప్రజలు బోర్ గా ఫీల్ అవుతున్నారని,దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని,కానీ ఇంట్లోనే ఉండి కరోనాతో పోరాడటం మినహా వేరే మార్గం లేదని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.

వార్తల ద్వారా తాను ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను తెలుసుకుంటున్నానని ఆయన అన్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన వూహాన్ సిటీలో లాక్ డౌన్ ఎత్తివేయబడి, సాదారణ పరిస్థిలు అక్కడ నెలకొన్నాయని సీఎం అన్నారు. ఇది చాలా మంచి వార్త అని తెలిపారు. దీని అర్థం సమయంతో విషయాలు మెరుగుగా ఉండగలవని ఆయన అన్నారు.(మేడిన్ ఏపీ.. రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తయారీ)