Maharashtra News
Maharashtra News: శత్రువుల దాడిలో కత్తిపోటుకు గురైన వ్యక్తి.. కత్తిని కడుపులో ఉంచుకొనే పోలీస్ స్టేషన్ కి పరుగు తీశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది. నాగపూర్ పోలీస్ స్టేషన్ కు అర కిలోమీటరు దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో 20 ఏళ్ల వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ క్రమంలోనే అతడిని కత్తితో పొడిచారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్ వైపు పరుగు తీశాడు.
అతకి స్నేహితుడు లిఫ్ట్ ఇవ్వడంతో కడుపులో కత్తితోనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. గాయాలతో ఉన్న యువకుడిని గమనించిన పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఇక ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలే దాడికి కారణమని పోలీసులు తెలిపారు.