Maharashtra : కోతి దాహం తీర్చిన పోలీస్‌.. ‘హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు‌’

మండిపోతున్న ఎండలో ఓ కోతిని వాటర్ బాటిల్ తో నీరు తాగించాడో పోలీసు.

Maharashtra

ఎండలు మండిపోతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మే నెల రాకుండానే నీటి కోసం మూగజీవాలు తల్లడిల్లిపోతున్నాయి. కాసిన్ని నీళ్లు దొరికితే చాలు తాగి ప్రాణం నిలుపుకుందామనే జీవులు ఎన్నో. అలా ఓ దాహంగా ఉన్న ఓ కోతికి నీరు పట్టించాడో ఓ పోలీసాయన.అతని పెద్ద మనస్సుకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మార్చి నెలలోనే ఎండలు మండించాయి. ఇక ఏప్రిల్ లో మే నెల ఎండల్ని తలపిస్తున్నాయి. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండ ధాటికి మనుషులలే జంతువులు కూడా తాళలేకపోతున్నాయి. మంచినీటి కోసం జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎండలను తట్టుకోలేని కోతి మంచినీటి కోసం విలవిల్లాడుతుండగా..సంజయ్ ఘుడే అనే ట్రాఫిక్ పోలీసు అధికారి  స్వయంగా దానికి మంచినీటిని తాగించాడు.

ఆ పోలీసాయన పెద్ద మనస్సుకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ను ఐఎఫ్ఎస్ ఆఫీసు సుశాంత నంద ట్విట్టర్ లో  షేర్ చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.