మొదటి బిడ్డకే వర్తింపు : మహారాష్ట్రలో ‘కేసీఆర్ కిట్’

  • Publish Date - January 31, 2019 / 02:02 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ఈ పథకాలు ప్రజలకు మేలు జరిగేలా ఉండడం…ఎక్కడా లేని పథకాలు ఆచరణలో సక్సెస్ అవుతుండడంతో ఆయా రాష్ట్రాలు వీటిపై ఇంట్రస్ట్ చూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొన్ని పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ బాటలో మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చేరింది. 

కేసీఆర్ కిట్ పేరిట తెలంగాణ రాష్ట్రంలో పథకం ప్రవేశ పెట్టింది. ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన శిశువులకు ‘బేబీ కేర్ కిట్’ పేరిట కొత్త పథకం ప్రవేశ పెడుతున్నట్లు మహారాష్ట్ర సర్కార్ వెల్లడించింది. జనవరి 29వ తేదీ మంగళవారం దీనిని ప్రకటించింది. కుటుంబంలో మొదటి బిడ్డకు మాత్రమే ఈ పథకం వర్తింపచేశారు. సుమారు 4 లక్షల మందికి ఈ పథకం లబ్ది చేకూరుస్తుందని…తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి పంకజ్ ముండే వెల్లడించారు. బేబీ కేర్ కిట్ పథకం అమలుకు రూ. 20 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 

మాతాశిశువుల సంరక్షణ కోసం ప్రసవించిన ప్రతి మహిళకు 16 రకాల వస్తువులతో తెలంగాణ రాష్ట్రంలో ‘కేసీఆర్‌ కిట్‌’ ఇస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి చేరిన మాతృమూర్తికి 12వేలు ఇవ్వాలని, ఆడపిల్ల పుడితే వెయ్యిరూపాయలు ఇస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు