First Omicron Patient: భారత్‌లోని ఫస్ట్ ఒమిక్రాన్ పేషెంట్‌కి కరోనా నెగటివ్

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్‌లో మహారాష్ట్రలో నమోదైంది.

First Omicron Patient: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్‌లో మహారాష్ట్రలో నమోదైంది. కొవిడ్ -19 ఒమైక్రాన్ వేరియంట్ సోకిన మొదటి రోగి 33 ఏళ్ల మెరైన్ ఇంజనీరు కోలుకున్నారు. లేటెస్ట్‌గా జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది.

ముంబై సమీపంలోని కళ్యాణ్-డోంబివిలీ మున్సిపల్ ప్రాంతంలో నివశిస్తున్న అతను.. నవంబర్ చివరి వారంలో ముంబైకి వచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అతను.. ఒమైక్రాన్ బారిన పడ్డారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా కూడా ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు అతనికి సూచించారు.

స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం, అతనికి రెండు RT-PCR పరీక్షలు నిర్వహించారు. రెండూ నెగెటివ్‌ రాగా.. అతను ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరోనాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు అతనిలో లేవు.

యాదృచ్ఛికంగా, ఈ రోజు అతని పుట్టినరోజు అని, అతని పుట్టినరోజు నాడే డిశ్చార్జ్ అవ్వడం సంతోషంగా ఉందని అతను చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 10 ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు