మహాత్మా గాంధీ కార్యదర్శి కల్యాణం కన్నుమూత

మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వి కళ్యాణం తన 99 సంవత్సరాల వయసులో చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా

Mahatma Gandh personal secretary : మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వి కళ్యాణం 99 సంవత్సరాల వయసులో చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా కల్యాణం మరణించినట్లు ఆయన చిన్న కుమార్తె నలిని తెలిపారు. 1943 నుండి 1948 వరకు ఆయన గాంధీ మహాత్మునికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. మహాత్ముని హత్య అనంతరం కల్యాణం తరువాత లండన్‌లో ఎడ్వినా మౌంట్ బాటన్ కార్యదర్శిగా పనిచేశారు. బుధవారం చెన్నై బీసెంట్‌ నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని కళ్యాణం కుమార్తె వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు