Mahindra Car : మహీంద్రా కారులో ఎలాంటి లోపం లేదు, ఎయిర్‌బ్యాగ్‌ ఓపెన్ కాలేదనే కేసుపై మహీంద్రా వివరణ

డాక్టర్ మరణించటానికి మహీంద్రా కారు కారణం అంటూ చేసిన ఆరోపణలపై మహీంద్రా కంపెనీ వివరణ ఇచ్చింది.

mahindra scorpio car airbags

Mahindra SUV Car airbags..UP Dr.Apoorv : ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన డాక్టర్ అపూర్వ్ మిశ్రా మృతికి మహీంద్రా కంపెనీ వాహనం కారణమంటూ నమోదైన కేసుపై దీనిపై మహీంద్రా కంపెనీ స్పందించింది. అతని మరణించటానికి మహీంద్రా కారు కారణం అంటూ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. మృతి చెందిన వ్యక్తి నడుపుతున్న స్కార్పియో SUV ఎయిర్ బ్యాగ్ లలో ఎలాంటి లోపం లేదని వివరణ ఇచ్చింది.

యూపీకి చెందిన రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి తన కుమారుడు డాక్టర్ అపూర్వ్ మిశ్రాకు 2020లో మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన స్కార్పియో (SUV)కారు కొని గిఫ్టుగా ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి 14, (2022)న అపూర్వ్ మిశ్రా తన స్నేహితులతో కలిసి కాన్పూర్ నుంచి లక్నో తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. కారు డివైడర్ కు ఢీకొని కారు నడుపుతున్న అపూర్వ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అపూర్వ్ మిశ్రా తండ్రి కారు నడిపే సమయంలో తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాడని ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకపోవటం వల్లే మరణించాడని తన కుమారుడు మరణానికి మహీంద్రా కంపెనీ కారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anand Mahindra : యువకుడు మృతి .. ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

కారులో (స్కార్పియో S9)సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగులు లేవని అందుకే తన కుమారుడు మరణించాడు అంటూ కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాతో పాటు కంపెనీకి చెందిన 12మందిపై ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి కారణం మహీంద్రా కంపెనీ కార్ల తయారీలో నిర్లక్ష్యమని దానికి కంపెనీ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహీంద్రా వాహనాల్లో భద్రతా ప్రమాణాలపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12మంది కంపెనీ అధికారులను నిందితులుగా చేర్చారు. ఈ విషయంగా కోర్టును ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

దీనిపై మహీంద్రా సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తు..ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోకపోవడానికి గల కారణాలు వివరించింది. అపూర్వ్‌ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ.. ప్రమాద సమయంలో కారు పల్టీలు కొట్టినందువల్ల ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోలేదని తెలిపింది. కారులో ఎయిర్ బ్యాగులు లేవంటు చేసే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రయాణీకుల భద్రత విషయంలో మహీంద్రా సంస్థ బాధ్యతగా ఉంటుందని ఎటువంటి నిర్లక్ష్యం చేయదని తెలిపింది. అలాగే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు విచారణకు తమ సంస్థ పూర్తిగా సహకరిస్తుందని తెలిపింది. అలాగే చనిపోయిన డాక్టర్ అపూర్వ్ మిశ్రా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.