Mumbai : ముంబైలో మారణహోమం తప్పదంటూ ఈ మెయిల్ .. అప్రమత్తమైన ఎన్ఐఏ

ముంబై మారణహోమం తప్పదంటూ ఎన్ఐఏ అధికారులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు.

Mumbai : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడి చేస్తాం అంటూ తాలిబన్ సభ్యుడి పేరుతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కి ఈమెయిల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి 3,2023) ముంబైలో మారణహోమం సృష్టిస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రత పెంచాలని సూచించారు. ఈ సూచనలతో ముంబై పోలీసులతో పాటు ఎన్ఐఏ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది. నగరంలోని పలుచోట్ల భద్రత పెంచడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపించిన వ్యక్తి తాను తాలిబన్ అని పేర్కొన్నాడు.

ఉత్తరప్రేదశ్ లో అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో పేలుళ్లకు పాల్పడతామంటూ ఫోన్ కాల్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రామజన్మభూమి స్థలంలో భద్రతను పెంచింది. రామ్ కోట్ లోని రాంలల్లా సదన్ ఆలయంలో నివసించే మనోజ్ అనే వ్యక్తికి గురువారం (ఫిబ్రవరి 2) ఈ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేయటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ఆలయ సముదాయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా గత జనవరిలో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. స్కూల్ ను పేల్చేస్తామంటూ కాల్ వచ్చింది. అలాగే 2022 అక్టోబర్ లో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామని ముంబై పోలీసులకు కాల్ వచ్చింది. నగరంలోని మాల్ అంథేరా, పీవీఆర్ మాల, జుహు, సహార హోటల్ వంటి ప్రాంతాల్లో బాంబులు పెట్టామని ఫోన్ చేసిన వ్యక్తి తెలిపాడు. ఇలా ముంబై పోలీసులకు ఇటువంటి కాల్ సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ ఏది నిజమో ఏది అబద్దమో ఆకతాయలు చేసిన కాల్సో అనే విషయాన్ని తెలుసుకోవటానికి ముంబై పోలీసులు యత్నిస్తుంటారు. కానీ ఆకతాయిల ఫోన్ల్ వల్ల విలువైన పోలీసులు సమయం వృథా అవుతుంటుంది. ఇటువంటి కాల్స్ చేసేవారిని పోలీసులు పట్టుకోవటానికి యత్నిస్తుంటారు.

 

ట్రెండింగ్ వార్తలు