Covaxin Travel Restrictions : కొవాగ్జిన్‌ టీకా WHO అనుమతి పొందేలా చొరవ చూపాలి.. కేంద్రానికి మమత లేఖ

కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి త్వరగా అనుమతి వచ్చేలా జోక్యం చేసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మమతా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Make sure Covaxin accepted globally : కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి త్వరగా అనుమతి వచ్చేలా జోక్యం చేసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మమతా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కొవాగ్జిన్‌కు అనుమతి వచ్చేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నామని, ప్రైవేటు ఆస్పత్రల్లో కూడా ఈ రెండింటిని వేస్తున్నాయని మమత లేఖలో తెలిపారు. అయితే, కొవాగ్జిన్‌కు ఇంకా WHO నుంచి అనుమతి రాలేదని తెలిసిందని మమత లేఖలో పేర్కొన్నారు. WHO ఆమోదించిన టీకాలను పూర్తిగా వేసుకోకపోతే.. చాలా దేశాలు వారిని తమ దేశంలోకి అనుమతించడం లేదన్నారు. దేశంలోని విద్యార్థులు పైచదువుల కోసం ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తుంటారు.

వీరిలో చాలామంది కొవాగ్జిన్ టీకా వేసుకున్నారని అన్నారు. విదేశాలకు వెళ్లేందుకు వారి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చెల్లుబాటు కాదని తెలుస్తోందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులందరూ డైలమాలో పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రధాని జోక్యం చేసుకుంటే విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయని అన్నారు. అంతేకాక, ఉద్యోగాలు, విద్యా, వ్యాపారం తదితర వాటి కోసం విదేశాలకు వెళ్లే వారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని మమత అన్నారు. రాష్ట్ర సచివాలయం నబన్నాలో ఆమె మాట్లాడారు. కొవాక్సిన్ టీకా తీసుకోకపోవడంతో బంగ్లాదేశ్, బ్రెజిల్‌తో కూడా సమస్యలను సృష్టించిందని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లే అనేక మంది విద్యార్థులు కొవాక్సిన్ మోతాదు తీసుకోన్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు.

మూడవ వేవ్ ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. 0-12 ఏళ్ల వయస్సు గల పిల్లల తల్లులకు టీకా డ్రైవ్ తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. టీకా పంపిణీలో కేంద్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మమతా అన్నారు. కొవాక్సిన్ టీకాకు విదేశాలలో అత్యవసర వినియోగ అనుమతి పొందలేదు. కొవాక్సిన్ తీసుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ వేదికపై కోవాక్సిన్ గుర్తింపు పొందేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నానని మమతా తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో 1,925 మందికి కొవిడ్-19 పాజిటివ్ రాగా.. 38 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 17,475 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 14,87,363కు చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు