Wedding Hall Police (2)
Male police searches the bride’s room : బిహార్‌లో మద్య నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, నిల్వలపై నిరంతరం దాడులు, సోదాలు సాగుతున్నాయి. మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు పట్నాలో ఓ పెళ్లి మంటపంలోని వధువు గదిలోకి మగ పోలీసులు చొరబడి సోదాలు చేపట్టారు.
వధువు గదిలో మగ పోలీసుల సోదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడ పోలీసులు లేకుండా వధువు గదిలో మగ పోలీసులు సోదాలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమాయక ప్రజలను పోలీసులు అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని విపక్షాలు మండిపడుతన్నాయి.
Galla Jayadev : ఏపీలో వర్షాలు కల్గించిన నష్టంపై ప్రధాని మోడీ, అమిత్ షాకు గల్లా జయదేవ్ లేఖ
నితీష్ కుమార్ ప్రభుత్వం అక్రమంగా మద్యం విక్రయాలను చేపడుతోందని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర ఆరోపిణలు చేశారు. మద్యం అక్రమ విక్రయాలపై దాడులు జరుపుతున్నామని భ్రమలు కల్పించేలా అమాయకులపై బూటకపు సోదాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.