Maoist
Maoist Dump ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడినట్లు మల్కాన్ గిరి పోలీసులు పేర్కొన్నారు. ఇక్కడ ప్రధానంగా అక్రమ ఆయుధాల తయారీ, భారీ బాంబులు, ల్యాండ్ మైన్స్ లను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాబడిన సమాచారం మేరకు.. జంత్రి పంచాయితీ పరిధిలో ఉన్న టాబెర్ మరియు అర్లింగ్ పాద ప్రాంతాల్లో పోలీసులు, బీఎస్ఎఫ్ బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో ఈ భారీ డంప్ ను పోలీసులు గుర్తించారు.
Also read: TS High Court: మంచిరేవులలో ఆ 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదే: పదేళ్ల తరువాత హైకోర్ట్ తీర్పు
6 IED టిఫిన్ బాక్సులు, 2 IED బాంబులు, రెండు 7.62 mm బాల్ అమ్యునేషన్, ఒక INSAS మ్యాగజైన్, ఒక IED మెకానిజం, ఒక జత బూట్లు, ఒక జత మావోయిస్టు యూనిఫాం, ఒక హావర్‌స్టాక్, ఒక కిట్ బ్యాగ్, ఒక 9 వోల్ట్ బ్యాటరీ, ఒక 3 వోల్ట్ బ్యాటరీ, మావోయిస్టు సాహిత్యం.. ఇతర సామాగ్రిని భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆయుధాలు తయారు చేసేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఈ డంప్ ను మావోయిస్టులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలను స్థానిక ప్రజలు, భద్రతా బలగాలపై ప్రయోగించేందుకు మావోయిస్టులు వ్యవహారచన చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈమధ్యకాలంలో మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించి భద్రత దళాలు ఛేదించిన అతిపెద్ద లక్ష్యం ఇదేనని మల్కాన్ గిరి పోలీసులు పేర్కొన్నారు.
Also read: Minister KTR: నల్లగొండలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్