Opposition Meet: విపక్షాల మెగా మీటింగులో అణుబాంబ్ అంతటి ప్రకటన చేసిన కాంగ్రెస్

ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే

Mallikarjun Kharge: దేశంలోని విపక్షాల రెండవ మెగా సమావేశం బెంగళూరులో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యి, మంగళవారం ముగింపు దిశగా కొనసాగుతున్నాయి. కాగా, రెండవ రోజు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రకటన చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ రాజకీయాల్లో అణుబాంబ్ అంతటి ప్రకంపనలు సృష్టించే ప్రకటన. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవి మీద ఆసక్తి లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Tamil Nadu : మరీ ఇంత త్యాగమా..! కొడుకు చదువు కోసం బస్సు కింద పడిన తల్లి..

‘‘ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదు. మా తాపత్రయం అధికారం సాధించడం కోసం అసలే కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించేందుకే మా ప్రయత్నం అంతా’’ అని ఖర్గే అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేము 26 పార్టీల నుంచి ఒక్కటయ్యాము. ఈ కూటమి 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ తనకు తానుగానే 303 సీట్లు గెలవలేదు. చాలా పార్టీల కూటమి కారణంగా వాళ్లు ఓట్లు, సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు వారి కంటే బలమైన కూటమిని మేము రూపొందించాము’’ అని అన్నారు.

Elon Musk Tesla : మరోసారి వార్తల్లో టెస్లా.. తీసుకున్న జీతాల్ని తిరిగి ఇచ్చేస్తామంటున్న డైరెక్టర్లు, ఆ మొత్తం ఎంతో తెలుసా..?

వాస్తవానికి విపక్షాల ఐక్యతలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వమే చాలా క్లిష్టంగా సాగుతూ వస్తోంది. ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే. అంతే కాకుండా.. చాలా రోజులుగా కూటమి ప్రయత్నాలపై జరుగుతున్న చర్చతో పాటే ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై కూడా పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ నేతలు బలంగా చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి కుర్చీ కోసం పోటీ పడటం లేదని ఏకంగా పార్టీ అధ్యక్షుడే చెప్పడం గమనార్హం.

Heavy Rains : రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

రాజకీయంగా బయటికి ఎన్ని చెప్పినప్పటికీ అధికార కుర్చీ కోసమే రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులు చేస్తుంటాయి. చాలా అరుదైన సందర్భాల్లో కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. వాస్తవానికి మిగిలిన విపక్ష పార్టీలతో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా బలం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 19.49 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన చూసుకుంటే విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే కావడం కొంత వరకు సమంజసమే కానీ.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు ఒప్పుకోవడం లేదు.

K. Narayana : పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం.. బీజేపీతో చేతులు కలపడం ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ప్రమాదకరం : కె.నారాయణ

2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక్క స్టాలిన్ మినహా మరెవరూ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదు. అలా అని బయటికి తమ విముఖతను తెలియజేయలేదు కానీ.. మౌనంగా ఉన్నారు. ఇప్పటి పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. ఇకపోతే ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఆశావాహులుగా ఉన్నారు. పలుమార్లు దీనిపై ఆయన వర్గీయులు ప్రకటనలు కూడా చేశారు. ఇక మమతా బెనర్జీ సైతం కాస్త ఆశగానే ఉన్నప్పటికీ.. గోవా అసెంబ్లీ ఎన్నికల అనంతరం సైలైంట్ అయ్యారు. వీరిద్దరు మినహా ప్రస్తుత మెగా విపక్షాల కూటమి నుంచి అంత స్థాయిలో ప్రధాని అభ్యర్థులు అయితే లేరు.

ట్రెండింగ్ వార్తలు