Tamil Nadu : మరీ ఇంత త్యాగమా..! కొడుకు చదువు కోసం బస్సు కింద పడిన తల్లి..

తన రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని పెంచింది. కొడుకును చదివించే ఓపిక ఇక ఆ తల్లి శరీరంలో లేకపోయింది. కానీ తాను లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు బాగుండాలనుకంది. దీంతో దారుణానికి పాల్పడింది. తన ప్రాణాన్నే త్యాగం చేసింది.

Tamil Nadu : మరీ ఇంత త్యాగమా..! కొడుకు చదువు కోసం బస్సు కింద పడిన తల్లి..

Woman jumping moving bus

Updated On : July 18, 2023 / 1:25 PM IST

Tamil nadu Woman jumping front of moving bus : కొడుకు కోసం ఓ తల్లి చేసిన త్యాగం మనస్సులో కదిలించేస్తోంది. తాను ఏదైనా వాహనం కిందపడి చనిపోతే పరిహారంగా వచ్చిన డబ్బుతో కొడుకు చదువుకోసం ఉపయోగపడుతుందని ఓ తల్లి బస్సుకింద పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసినవారంతా బిడ్డల కోసం మరీ ఇంత త్యాగమా తల్లీ అంటున్నారు. సేలం కరెక్టరార్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ తన కొడుకు చదువు కోసం ఇంతటి త్యాగానికి పాల్పడింది. తమ కళ్లముందే ఆమె బస్సు కింద పడటం చూసినవాళ్లంతా ఆమెకు ఏ కష్టమొచ్చిందో అని అనుకున్నారు. కానీ ఆమె కష్టం వెనుక..ప్రాణత్యాగం వెనుక ఇంతటి హృదయాన్ని కదలించే త్యాగం ఉందని తెలియలేదు. జూన్ 28న వేగంగా వెళుతున్న బస్సు కింద పడి ప్రాణాలు విడిచింది 15 ఏళ్ల పాపాతి అనే మహిళ.

15 ఏళ్లుగా తన రెక్కలు ముక్కలు చేసుకుని పాపాతి తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటు వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తెను అతికష్టంమీద డిగ్రీ వరకు చదివించింది. ఒక కొడుకును చదివించే ఓపిక తన శరీరంలో లేకపోయింది. కాలేజీ ఫీజు కట్టటానికి డబ్బుల్లేవు. దీంతో తాను ప్రమాదంలో తాను చనిపోతే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని..ఆ వచ్చిన డబ్బుతో తన కొడుకు చదువు కోసం ఉపయోపడుతుందని భావించిన ఆ తల్లి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంది. కుమారుడి చదువు కోసం రూ.45 వేలు అవసరం అయితే.. ఎక్కడా అప్పు పుట్టక మనస్తాపం చెందిన ఆ తల్లి.. బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.

Air india : మొబైల్ ఫోన్ వేడెక్కిందని విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

కన్నీళ్లుపెట్టించే ఈ ఘటన తమిళనాడులోని సేలంలో గత నెల 28న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో భాగంగా ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా..కావాలనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిపై మరింత విచారణ చేయగా తాను ప్రమాదానికి గురి అయితే వచ్చే పరిహారం డబ్బులతో కొడుకు చదువు కోసం ఉపయోగపడతాయని భావించి ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు.

తన కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి రూ. 45,000 అవసరం కాగా.. అప్పు కోసం ప్రయత్నించి విఫలమైందని..పారిశుధ్య కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని భావించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడయ్యింది. ఆ సొమ్ముతో తన కుమారుడికి కాలేజీ ఫీజు కట్టి చదువుకుంటాడనే ఆలోచనతో ఇలా చేసిందని తెలిపారు.

Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా