Air india : మొబైల్ ఫోన్ వేడెక్కిందని విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

ఓ మొబైల్ ఫోన్ వల్ల విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం బయలుదేరిన కొంతసేపటికే 140మంది ప్రయాణీకులున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

Air india : మొబైల్ ఫోన్ వేడెక్కిందని విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్

air india flight emergency landing

air india flight emergency landing : టేకాఫ్ తీసుకున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాలంటే పెద్ద కారణమే ఉండాలి. అలా ఓ మొబైల్ ఫోన్ వల్ల ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మొబైల్ ఫోన్ కు విమానం ఎమర్జీన్సీ ల్యాండింగ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? ఆ మొబైల్ ఫోన్ వల్లే విమానం అంతా పొగ కమ్మేసింది. ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం (జులై 17,2023)న ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణీకులు వచ్చారు. అనుకున్న సమయానికి విమానం టేకాఫ్ తీసుకుంది. కానీ కొద్దిసేపటికే విమానంలో ఓ ప్రయాణీకుడు తన మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టుకోగా అదికాస్తా వేడెక్కింది. ఎంత వేడెక్కిందంటే పొగలు వచ్చేంతగా..దీంతో ఆ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్ కు చెప్పటంతో ఆ మొబైల్ ఏ సమయంలోనే పేలిపోతుందనే ఆందోళనతో అప్రమత్తమైన పైలట్‌ వెంటనే ఉదయ్‌పుర్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…

కానీ అప్పటికే విమానంలో పొగ కమ్మేసింది. విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ తో పెను ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రయాణీకులతో పాటు సిబ్బంది అంతా సేఫ్ గా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ల్యాండ్ అయినవిమానాన్ని టెక్నికల్ సిబ్బంది పూర్తిగా తనిఖీలు నిర్వహించిన గంట తరువాత విమానం తిరిగి బయలుదేరింది. ఎయిర్ ఇండియా విమానంలో 140మంది ప్రయాణీకులతో పాటు సిబ్బంది ఉన్నారు.