Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది.....

Yamuna continues to rise : యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది…

Yamuna continues to rise

Yamuna continues to rise : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది. యమునా నది నీటి మట్టం మంగళవారం 206 మీటర్లకు చేరుకుంది. (Yamuna continues to rise) ఇప్పటికీ ప్రమాదకర స్థాయికి మించి నది ప్రవహిస్తోంది.
అంతకుముందు సోమవారం ఉదయం యమునా నీటిమట్టం 205.48 మీటర్లు దాటింది. ఇది ప్రమాద స్థాయి 205.33 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది.

Dengue Cases : మళ్లీ ఢిల్లీని వణికిస్తున్న డెంగీ జ్వరాలు…163 కేసులు వెలుగు

ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటలకు యమునా నది నీటిమట్టం 206.01 మీటర్లుగా నమోదైంది. రాజధానిలోని విస్తారమైన ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురువడంతో యమునా నదిలో నీటి మట్టం స్వల్ప పెరుగుదల ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. జాతీయ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్లకు తిరిగి రావద్దని ఢిల్లీ మంత్రి అతిషి సూచించారు. ( Delhi government urges people to stay put at camps)

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో చిరుతపులి దాడి..12 మందికి గాయాలు

ఒక రోజు ముందు యమునా నది నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ కొన్ని ప్రయాణ ఆంక్షలను సడలించింది. ఢిల్లీలో భారీ సరుకుల రవాణా వాహనాల ప్రవేశం ఇకపై సింఘు సరిహద్దు నుంచి మాత్రమే పరిమితం చేశారు. యమునాలో నీటి మట్టం 4 రోజులు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీలోని కాశ్మీరీ గేట్‌కు వచ్చే అంతర్రాష్ట్ర బస్సులు సింగు సరిహద్దుకు మాత్రమే చేరుకోవాలని ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

నీటి ఎద్దడి కారణంగా సింగు సరిహద్దు, బదర్‌పూర్ సరిహద్దు, లోనీ సరిహద్దు, చిల్లా సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించారు. అయితే ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే భారీ వాహనాలను అందులో నుంచి మినహాయించారు. రింగ్ రోడ్‌లో ట్రాఫిక్ కదలిక తిరిగి ప్రారంభమైందని, రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోరారు.

Twitter DM Updates : ట్విట్టర్ DM సెట్టింగ్‌ అప్‌డేట్.. వెరిఫైడ్ యూజర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

యమునా నీటి మట్టం సోమవారం రాత్రి 10 గంటలకు 206 మీటర్లకు చేరుకుంది. 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయి కంటే ఎక్కువగా ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా యమునా నది నీటిమట్టం స్వల్పంగా పెరిగిందని మంత్రి తెలిపారు.