Twitter DM Updates : ట్విట్టర్ DM సెట్టింగ్‌ అప్‌డేట్.. వెరిఫైడ్ యూజర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

Twitter DM Updates : వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు అంటే.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ యూజర్లను మీరు ఫాలో కాకుంటే ‘మెసేజ్ రిక్వెస్ట్ సెక్షన్‌’లో స్పామ్ కింద స్టోర్ అవుతాయి.

Twitter DM Updates : ట్విట్టర్ DM సెట్టింగ్‌ అప్‌డేట్.. వెరిఫైడ్ యూజర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

Twitter Updates DM settings to reduce spam messages even from verified users

Twitter DM Updates : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) స్పామ్ మెసేజ్‌లకు చెక్ పెట్టేసింది. ట్విట్టర్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMలు) స్పామ్ సమస్య ఉన్నట్లు ట్విట్టర్ అంగీకరించింది. ఇప్పుడా ఆ స్పామ్ ఇష్యూను ఫిక్స్ చేస్తూ కంపెనీ డిఫాల్ట్ DM సెట్టింగ్‌కు మార్పులు చేసింది. ఇప్పటి నుంచి మీరు ఫాలో చేయని యూజర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు ‘Message Request’ సెక్షన్‌లో రీడైరెక్ట్ అవుతాయి. మీరు ఫాలో చేసే యూజర్ల నుంచి DMలు ఆటోమాటిక్‌గా మీ ప్రైమరీ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి. అదనంగా, వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు అంటే.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవి, మీరు వారిని ఫాలో కాకుంటే మాత్రం ‘Message Request’ సెక్షన్‌లో స్టోర్ అవుతాయని కంపెనీ పేర్కొంది.

కొత్త సెట్టింగ్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. ట్విట్టర్ DM ఇన్‌బాక్స్‌లలో స్పామ్‌ను తగ్గించడంలో సాయపడుతుందని కంపెనీ ఈ మేరకు ట్వీట్ చేసింది. జూలై 14వ తేదీ నుంచి DMలలో స్పామ్ మెసేజ్‌ల సంఖ్యను తగ్గించడంలో సాయపడే కొత్త మెసేజ్ సెట్టింగ్స్ యాడ్ చేస్తున్నామని పేర్కొంది. కొత్త సెట్టింగ్ ప్రారంభమైతే.. మీరు ఫాలో అయ్యే యూజర్ల నుంచి మెసేజ్‌లు వస్తాయి. మీ ప్రైమరీ ఇన్‌బాక్స్‌లో మీరు ఫాలో చేయని వెరిఫైడ్ బ్లూ టిక్ యూజర్ల నుంచి మెసేజ్‌లు మీ మెసేజ్ రిక్వెస్ట్ ఇన్‌బాక్స్‌కు వచ్చి చేరుతాయి. ప్రతి ఒక్కరి నుంచి మెసేజ్ రిక్వెస్టులను అనుమతించడానికి గతంలో వారి అనుమతులను సెట్ చేసిన యూజర్లు ఈ కొత్త సెట్టింగ్‌కి మారిపోతారు. కావాలాంటే మళ్లీ ఎప్పుడైనా వెనక్కి స్విచ్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Experts Warn Game Addiction : పిల్లల్లో గేమింగ్ వ్యసనం.. పేరంట్స్ ఇంటర్నెట్ ఆపేస్తే.. Wi-Fi కోసం రాత్రిళ్లూ ఇళ్లలో నుంచి పారిపోతున్నారు..!

ట్విట్టర్ DM FAQ పేజీని కూడా కంపెనీ అప్‌డేట్ చేసింది. ట్వీట్‌లో పేర్కొన్నట్లుగా.. వినియోగదారులు పాత (Twitter DM) సెట్టింగ్‌ పొందాలంటే మైగ్రేట్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ వెర్షన్‌లో DM సెట్టింగ్‌లను మార్చేందుకు ఇన్‌బాక్స్‌ని ఓపెన్ చేసి టాప్ రైట్ సైడ్ సెట్టింగ్‌ల మెనును చూడండి (Settings icon), మీరు ఫాలో అయ్యే యూజర్ల నుంచి మెసేజ్‌లను అనుమతించండి. వెరిఫైడ్ యూజర్ల నుంచి మాత్రమే మెసేజ్ రిక్వెస్ట్ ఫాలో చేయండి వంటి ఆప్షన్ల మధ్య ఎంచుకోండి. లేదా ‘అందరి నుంచి మెసేజ్ రిక్వెస్ట్ అనుమతించు’ అనే రీడ్ రిసిప్ట్‌లను చూసేందుకు ఒక ఆప్షన్ కూడా ఉంది. iOS లేదా Android యూజర్లు తమ (Twitter) యాప్‌లో సెట్టింగ్‌లను మార్చడానికి యూజర్లు ఇదే మెథడ్ ఉపయోగించవచ్చు.

Twitter Updates DM settings to reduce spam messages even from verified users

Twitter Updates DM settings to reduce spam messages even from verified users

అప్‌డేట్ చేసిన సెట్టింగ్ నిర్దిష్ట యూజర్లకు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, మెసేజ్ రిక్వెస్టులు సెక్షన్‌లో మెసేజ్‌లను ఆటోమాటిక్‌గా కస్టమైజ్ చేయడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. DMలు సామాజిక కనెక్షన్‌లను విస్తరించడానికి, క్లయింట్‌లను కలవడం వంటి వ్యాపార అవకాశాలను సులభతరం చేసేందుకు విలువైన టూల్‌గా ఉపయోగపడతాయి. సాధారణ యూజర్లతో కనెక్ట్ కావడం ద్వారా కోట్స్, స్టోరీలను కోరుకునే జర్నలిస్టులకు కూడా కీలక పాత్ర పోషిస్తారు. అయినప్పటికీ, ట్విట్టర్ యూజర్లు తమకు కావలసినదాన్ని ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మెటా ద్వారా థ్రెడ్స్ (Meta Threads) నుంచి తీవ్ర పోటీ కారణంగా ట్విట్టర్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ చిన్న ఫీచర్ ప్రవేశపెట్టింది.

ఇటీవల, మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ Threads యాప్ లాంచ్ చేసిన తర్వాత కేవలం 72 గంటల్లో Threads యాప్ 100 మిలియన్ల సైన్-అప్‌లను పొందాయని ప్రకటించారు. థ్రెడ్స్ యాప్ తప్పనిసరిగా 1 బిలియన్‌కు పైగా యూజర్లను కలిగిన ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌టెన్షన్ అని చెప్పవచ్చు. అందుకే ఎక్కువ మంది యూజర్లు ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌లో చేరవచ్చు. ట్విట్టర్ కూడా పాత యూజర్లను నిలబెట్టుకోవడంతో పాటు కొత్త యూజర్లను ఆకర్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. వినియోగదారులు తమ ట్వీట్ల కోసం డబ్బు సంపాదించడానికి కంపెనీ ఇటీవల తన విధానాన్ని మార్చింది. ట్విట్టర్ యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read Also : Microsoft Employee : ఏడాదిన్నరకే ఉద్యోగం కోల్పోయిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి.. కెరీర్‌లో ముచ్చటగా మూడోసారట..!