Dengue Cases : మళ్లీ ఢిల్లీని వణికిస్తున్న డెంగీ జ్వరాలు…163 కేసులు వెలుగు

యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....

Dengue Cases : మళ్లీ ఢిల్లీని వణికిస్తున్న డెంగీ జ్వరాలు…163 కేసులు వెలుగు

Delhi Dengue Cases

Dengue Cases in Delhi : యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి. జులై 15వతేదీ వరకు ఢిల్లీలో 163 డెంగీ జ్వరాల కేసులు నమోదవడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. (Delhi sees 163 Dengue Cases)

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

గత రెండేళ్లుగా ఢిల్లీలో డెంగీ జ్వరాలు ప్రబలుతూనే ఉన్నాయి. యమునా నది వరదలు వెల్లువెత్తిన గడచిన వారం రోజుల్లోనే 39 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్థుతం 10 మంది డెంగీ జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో డెంగీ జ్వరాలతో పాటు 14 చికున్ గున్యా, 54 మలేరియా కేసులు నమోదయ్యాయి. యమునానది వరదనీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారులను ఆదేశించారు.

Small Plane Crash : పోలాండులో కుప్పకూలిన చిన్న విమానం..ఐదుగురి మృతి

వరదనీరు నిలిచిన ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని దీనివల్ల డెంగీ, మలేరియా జ్వరాలు పెరుగుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డెంగీ జ్వరాల కేసులు పెరుగుతున్నాయని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ సురన్ జిత్ ఛటర్జీ చెప్పారు.

Amanchi Krishna Mohan : పాముకాటుకు గురైన వైసీపీ నేత, వెంటనే ఆసుపత్రికి తరలింపు, ఆందోళనలో కుటుంబసభ్యులు

జ్వరాలు, వాంతులు, ఒళ్లు నొప్పులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని, వరదల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలవచ్చని డాక్టర్ చెప్పారు. తీవ్ర జ్వరం, వాంతులతో రోగులు ఆసుపత్రిలో చేరారని లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. వరదల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ అధికారులను ఆదేశించారు.