Mamata Banerjee: మమత బెనర్జీ ఇంట విషాదం

కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సోదరుడు ఆషీమ్‌ బెనర్జీ కరోనా బారినపడి శనివారం మృతి చెందారు. కొద్దీ రోజుల క్రితం కరోనా సోకడంతో ఆషీమ్‌ బెనర్జీని కోల్ కతాలోని మెడికా ఆసుపత్రిలో చేర్చారు.

Mamata Banerjee

Mamata Banerjee: కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సోదరుడు ఆషీమ్‌ బెనర్జీ కరోనా బారినపడి శనివారం మృతి చెందారు. కొద్దీ రోజుల క్రితం కరోనా సోకడంతో ఆషీమ్‌ బెనర్జీని కోల్ కతాలోని మెడికా ఆసుపత్రిలో చేర్చారు.

పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే మృతి చెందారు. ఈ విషయాన్నీ మెడికా ఆసుపత్రి చైర్మన్ అలోక్ రాయ్ మీడియాకు తెలిపారు. ఆషీమ్‌ బెనర్జీని బ్రతికించేందుకు డాక్టర్ల బృందం తీవ్రంగా కృషి చేసిందని కానీ లంగ్స్ తోపాటు శరీరంలోని మరికొన్ని అవయవాలు చెడిపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారని తెలిపారు.

ఇక కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్‌ ఘాట్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.