నందిగ్రామ్ పోలింగ్ బూత్ నుంచే గవర్నర్ కు మమత ఫోన్

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇవాళ రెండో ద‌శ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

Nandigram Booth ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇవాళ రెండో ద‌శ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. రెండో దశలో భాగంగా 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇవాళ పోలింగ్ జరగుతున్న నియోజవర్గాల్లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న‌ నందిగ్రామ్‌ కూడా ఉంది. ఈ నియోజవర్గంలో మమతపై బీజేపీ అభ్య‌ర్థిగా మమతకు ఒకప్పటి సన్నిహితుడైన సువేందు అధికారి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో నందిగ్రామ్ పోరు రసవత్తరంగా మారింది.

అయితే, ఇవాళ పోలింగ్ నేపథ్యంలో నందిగ్రామ్ సమీపంలో ఉన్న బ‌యాల్ గ్రామంలో దీదీ ప‌ర్య‌టించారు. వీల్‌చైర్‌పైనే ఆమె టూర్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలింగ్ బూత్‌ను దీదీ సందర్శించారు. పోలింగ్ బూత్ వద్ద జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌తో మమతా బెనర్జీ మాట్లాడారు. స్థానిక ప్రజలను ఓటు వేయనీయకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని మమత గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఉద‌యం నుంచి ప్రచారం నిర్వ‌హిస్తున్నానని, స్థానిక ఓట‌ర్ల‌ను వాళ్లు అడ్డుకుంటున్నార‌ని, ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ఫిర్యాదు చేస్తున్న‌ట్లు దీదీ ఫోన్‌లో తెలిపారు. ఈ విష‌యాన్నిగ‌మ‌నించాల‌ని గవర్నర్ ను మమత కోరారు.

కాగా,మమత పోలింగ్ బూత్ కు చేరుకున్న సమయంలో కొంతమంది మమతకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మమత మండిపడ్డారు. నినాదాలు చేస్తున్నవారందరూ బయటివారన్నారు. వాళ్లంతా బీహార్‌, యూపీ నుంచి వ‌చ్చార‌ని, వారికి కేంద్ర బ‌ల‌గాలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయ‌ని సీఎం మ‌మ‌తా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు