కోల్ కతాలో మమతా రోడ్ షో 

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బుధవారం  కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు.

  • Publish Date - May 15, 2019 / 02:07 PM IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బుధవారం  కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు.

కోల్ కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం  కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ర్యాలీ సందర్భంగా  మంగళవారం నాడు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపధ్యంలో బిజెపి పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బెలియాఘటా నుంచి నడుచుకుంటూ బయలు దేరారు. దీంతో  ఆ మార్గంలో భారీగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. 
Also Read : పంజాబ్ లో ట్రాక్టర్ నడిపిన రాహుల్

పశ్చిమ బెంగాల్ లో మమత హింసను ప్రేరేపిస్తున్నారని, మమత  ఎన్నికల ప్రచారంలో పాల్గోనకుండా నిషేధం విధించాలని మంగళవారం బీజీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా రోడ్ షోలో బీజేపీ  ఇతర రాష్ట్రాలనుంచి కిరాయి గూండాలని తీసుకువచ్చి అల్లరి చేశారని మమత ఆరోపించారు. దీనిపై టీఎంసీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. శ్యామ్ బజారు వరకు మమత నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు