Mamata Banerjee : అచ్చేదిన్ అంటే ఇదేనా ? కేంద్రంపై మమతా ఫైర్

అచ్చేదిన్ అంటే ఇదేనా..ఈ మాట చెబుతూ..దేశాన్ని సర్వనాశనం చేశారంటూ..కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ.

Mamata Banerjee Meets Vijai Sardesai : అచ్చేదిన్ అంటే ఇదేనా..ఈ మాట చెబుతూ..దేశాన్ని సర్వనాశనం చేశారంటూ..కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతోందని, గ్యాస్ సిలిండర్, చమురు ధరలు ఎలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారామె. జీఎస్టీ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి మమత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని మమత బెనర్జీ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : Puneeth Rajkumar : తన స్నేహితుణ్ణి చూసి ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం…గోవాలో దీదీ మకాం వేశారు. గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ తో సమావేశమయ్యారు. గోవా అసెంబ్లీ ఎన్నికల క్రమంలో..తృణముల్ కాంగ్రెస్, గోవా ఫ్వార్డర్ పార్టీ..ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మమత మాట్లాడారు. ఎన్ని ధరలు పెరిగిపోతున్నా..సమస్యలను పరిష్కరించాలనే సోయి కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు. ఇంకా అచ్చేదిన్ వస్తున్నాయంటూ చెబుతున్నారని, అయితే..దేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయిందని తీవ్రంగా మండిపడ్డారామె.

Read More : Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి

ఈ సందర్భంగా పొత్తుల విషయంపై మీడియా పలు ప్రశ్నలు సంధించింది. కొద్దిసేపటి క్రితమే గోవా…ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ తో మాట్లాడడం జరిగిందని, పోటీ చేసే విషయంలో చర్చించడం జరిగిందన్నారు. అయితే..ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలని తెలిపారు. పార్టీలో చర్చించి..పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటామని విజయ్ వెల్లడించారు. మరి..ఈ పార్టీల మధ్య పొత్తులు కుదుతురాయా.. ? మమతా పాచిక పారుతుందా ? లేదా అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు